Monday, April 29, 2024
- Advertisement -

ముదురు హీరోతో రొమాన్స్ చేయ‌నున్న ఆర్‌ఎక్స్‌ 100’ హాట్‌ బ్యూటీ…

- Advertisement -

మొదటి సినిమా ఆర్‌ఎక్స్100 తోనే కుర్రకారు మనసు దోచుకుంది పాంజాబ్ భామ పాయల్ రాజ్‌పుత్. దీంతో ఆమెకు వ‌రుస‌గా అవ‌కాశాలు త‌న్నకొస్తున్నాయి.సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయమైన ఈ హాట్ భామ ఏ మాత్రం వెనకాడకుండా తన అందచందాలను ఆరబోసింది. ఈ హాట్ బ్యూటీతో రొమాన్స్ చేయ‌డానికి ముదురు హీరోలు పోటీ ప‌డుతున్నారు.

ప్రస్తుతం సీనియర్ హీరో రవితేజకు జోడిగా డిస్కోరాజా సినిమాలో, వెంకటేష్‌కు జోడిగా వెంకీ మామ సినిమాలో నటిస్తున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సీత సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అలరించనున్నారు.

తనతో రొమాన్స్ చేయబోతోంది యంగ్ హీరోనా లేక సీనియర్ హీరోనా అనేది ఏ మాత్రం పట్టించుకోకుండా పాయల్ కూడా వెంటనే కమిట్ అవుతోంది. వయసుతో పనేంటి అనుకుందో ఏమో వరుసగా సీనియర్ హీరోలతో రొమాన్స్‌కు సై అంటోంది. తాజాగా మరో సీనియర్ హీరోతో జోడి కట్టేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.బాలయ్య హీరోగా తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో నటసింహంతో రొమాన్స్‌కి సిద్దమైందట పాయల్ రాజ్‌పుత్‌.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -