సినీ పరిశ్రమకు కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. తొలిసారి తెలుగు సినీ పరిశ్రమ వంద కోట్ల మైలురాయిని రాజమౌళి దాటించాడు. ఆ తర్వాత రూ.150 కోట్లు, రూ.500 కోట్లు, రూ. వెయ్యి కోట్లు, చివరికి రూ.1,500 కోట్ల మైలురాయిని సాధించిన ఘనత జక్కన్నకే దక్కింది. ఇప్పుడు బాహుబలి కన్‌క్లూజన్ ఇప్పటివరకు రూ.1,917 కోట్ల కలెక్షన్లు సాధించాయి.
మరికొన్ని రోజులైతే వివిధ షోలు, తదితర కార్యక్రమాల ద్వారా రూ.2 వేల కోట్లను దాటినా దాటవచ్చు. అది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ విధంగా రాజమౌళి మన తెలుగు కాదు కాదు భారత సినీ పరిశ్రమనే ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన మేటి దర్శకుడు రాజమౌళి. విభిన్న కథలతో, కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలు తెరకెక్కిస్తూ సినీ లోకాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. కేవలం నటులతోనే కాక గ్రాఫిక్స్‌తోనే సినిమాను విజయాల పట్టాలు ఎక్కించవచ్చని నిరూపించాడు. కథ బాగా ఉండడమే కాదు తీసే విధానం.. దాన్ని క్యాష్ చేసుకునే విధానం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య మాదిరి తెలుసు.
జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రారంభమైన ఆయన సినిమా ప్రస్థానం బాహుబలులతో ప్రపంచానికి తెలిశాడు. ఆయన సినిమాల్లో నటించిన హీరోలందరికీ వారి భవిష్యత్ బంగారు బాటగా మారింది. చివరికి హాస్య నటుడుగా ఉంటూ హీరోగా నటించిన సునీల్‌కు విజయాలు దక్కలేదు. రాజమౌళితో సినిమా మర్యాద రామన్నతో అతడికి హీరోగా ఓ హిట్ లభించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో, ప్రభాస్‌తో మూడేసి సినిమాలు జక్కన్న తీశాడు. రాంచరణ్, నితిన్, రవితేజ, సునీల్, నానిలతో ఒక్కొక్క సినిమా చేశాడు. ఈ విధంగా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ప్రేక్షకులను అమితంగా నచ్చే సినిమాలు వస్తున్నాయి.ఆయన తీసిన సినిమాలు 11 మాత్రమే. కానీ ఆ అన్నీ సినిమాల కలెక్షన్లు ఇప్పటివరకు రూ.2,858.05 కోట్లుగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాలకు అవార్డులు తన్నుకుంటూ వస్తుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో కూడా న్యాయం జరిగింది. బాహుబలి బిగినింగ్‌కు 11 నంది అవార్డులు వచ్చాయి. ప్రస్తుతానికి రాజమౌళి ఎలాంటి సినిమా ప్రకటించలేదు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ తీస్తున్నట్లు టాక్.
ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల కలెక్షన్ల వివరాలు
స్టూడెంట్ నంబర్-1 ఖర్చు 3 కోట్లు వసూళ్లు 12.00 కోట్లు
సింహాద్రి ఖర్చు 8 కోట్లు వసూళ్లు 26.00 కోట్లు
సై ఖర్చు 5 కోట్లు వసూళ్లు 9.50 కోట్లు
ఛత్రపతి ఖర్చు 10 కోట్లు వసూళ్లు 21.00 కోట్లు
విక్రమార్కుడు ఖర్చు 11 కోట్లు వసూళ్లు 19.50 కోట్లు
యమదొంగ ఖర్చు 18 కోట్లు వసూళ్లు 28.75 కోట్లు
మగధీర ఖర్చు 44 కోట్లు వసూళ్లు 151.00 కోట్లు
మర్యాద రామన్న ఖర్చు 14 కోట్లు వసూళ్లు 29.00 కోట్లు
ఈగ ఖర్చు 26 కోట్లు వసూళ్లు 42.30 కోట్లు
బాహుబలి బిగినింగ్ ఖర్చు 136 కోట్లు వసూళ్లు 602.00 కోట్లు
బాహుబలి కన్‌క్లూజన్ ఖర్చు 250 కోట్లు వసూళ్లు 1,917.00 కోట్లు
మొత్తం ఖర్చు 525 కోట్లు వసూళ్లు 2,858.05 కోట్లు (ఇప్పటివరకు)