Tuesday, May 14, 2024
- Advertisement -

మొదటి రోజు సాహో వసూల్లు …..షాక్ లో ప్రభాస్

- Advertisement -

ప్రభాస్ సాహో.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావటంతో పాటు, ఇండియాస్‌ బిగెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అన్న ప్రచారం జరగటంతో సాహోపై భారీఅంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానె తొలి రోజు సెచంరీ కొట్టింది.

తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనె రూ.42 కోట్లు సాధించినట్లు సమాచారం.టాక్‌ తో సంబంధం లేకుండా సాహో సినిమా భారీ వసూళ్లు సాదిస్తుండటంతో డార్లింగ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ ఘనత సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది సాహో. మొదటి స్థానంలోనూ ప్రభాస్‌ సినిమాయే ఉండటం విశేషం. బాహుబలి 2తో తొలి రోజే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన రికార్డ్‌ నెలకొల్పిన ప్రభాస్‌, సాహోతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు.కేవలం హిందీలోనే 24 కోట్లకు పైగా షేర్‌ సాధించి ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది.మరో మూడు రోజుల పాటు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా.సుజిత్ దర్శకత్వం వహించగా శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించింది.రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -