Sunday, May 4, 2025
- Advertisement -

పడుతున్నాడు లేస్తున్నాడు.. ఎలా నిలబడుతున్నాడు

- Advertisement -

బ్యాండ్ మేళం బ్యాచ్ తమన్ ఇప్పుడు ఫుల్ బిజి అయిపోయాడు.వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా ‘రాజు గారి గది’ ‘మహానుభావుడు’ సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఈ రెండు ఇచ్చిన విజయాలతో మనోడు వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నాడు. ఈ ఫిల్మ్ తో పాటు మరో రెండు సినిమాలకు తమన్ వర్క్ చేయ్యబోతున్నాడని తెలుస్తుంది.

అయిపోయిందనున్న తమన్ కెరియర్ ఇప్పటికి రెండుసార్లు పైకి లేచింది. పడుతోన్న ప్రతిసారి తమన్ అయిపోయాడనే అంతా అనేవారు.కాని అలాంటిదేమి లేకుండానే మనోడు తనకున్న మ్యూజిక్ గ్రిప్ తో అలా నిలబడిపోతున్నాడు. విచిత్రమేమిటంటే… తమన్ అయిపోయాడన్న ప్రతిసారి తిరిగి ఓ యంగ్ట ఆప్ హీరో సినిమాకు మ్యూజిక్ చేసి పైకి వస్తున్నాడు. అదే తమన్ కు కాపాడేస్తుంది.

బహుశ తమన్ పై అతని తాతగారు ఘంటసాల బలరామయ్యగారి ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంది. కెరియర్ స్టార్టింగ్ లో తడబడినప్పుడు తాతగారి గుడ్ విల్ కాపాడితే.. ఇప్పుడు మనోడి క్యాలిబర్ అతన్ని నిలబెట్టేస్తుంది. అంతే తేడా….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -