Sunday, April 28, 2024
- Advertisement -

PKSDT సినిమా టైటిల్ వచ్చేసింది..

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి మొదటిసారి స్క్రీన్ పంచుకుంటున్న సినిమాకి ‘BRO’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు. కాలాన్ని సూచించేలా ఇంగ్లీష్ అక్షరాలతో ఎంతో అందంగా రూపొందించిన టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది.

ఇక ఈ ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్ అయితే కట్టిపడేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పరమేశ్వరుడి రూపం కనిపిస్తుండగా.. “కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకం వినిపిస్తుండగా.. మెడలో ఓం లాకెట్ ధరించి స్టైలిష్ గాడ్ లా కనిపిస్తున్న కథానాయకుడు పవన్ కళ్యాణ్ రూపాన్ని పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.

ఇక ‘బ్రో’ టైటిల్‌ పోస్టర్‌ మోషన్‌ వీడియో విషయానికొస్తే.. పవన్‌ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న థమన్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అభిమానులకు బాగా నచ్చుతోంది. పవన్‌ పూర్తిగా స్లిమ్‌ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘వినోదాయ సిథం’ అనే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -