Sunday, April 28, 2024
- Advertisement -

సాహో వసూళ్లు: ఆరు రోజుల కి డెబ్భై రెండు కోట్లు

- Advertisement -

సాహో సినిమా వసూళ్లు అంతకంతకూ తగ్గుతూ రావడం గమనార్హం. అయితే ఈ సినిమా వినాయక చవితి రోజు వరకు బాగానే వసూలు చేసినా, మంగళవారం నుంచి మాత్రం బాగా పడిపోయింది. ఈ సినిమా ఎప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుంది, అసలు బయ్యర్లు గట్టెక్కుతారా అనే విషయం లో మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. అయితే బుధవారం నాడు ఈ సినిమా వసూళ్లు బాగా తగ్గాయి. కేవలం, తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నాడున్న కోటి డెబ్భై లక్షలు మాత్రమే రావడం ప్రభాస్ కి ఎంత మాత్రం రుచించడం లేదు.

ప్రభాస్ కి ఉన్న మార్కెట్ కి ఈ సినిమా ఇంకా ఎక్కువే వసూలు చేయాలి కానీ సినిమా మాత్రం అనూహ్యం గా పడిపోయింది. ఇక ఆరు రోజులకి కలిపి ఈ సినిమా డెబ్భై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలని తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. ఐదవ రోజు కలెక్షన్ తో చూస్తే ఆరవ రోజున దాదాపు గా యాభై శాతం వసూళ్లు పడిపోయాయి.చూడబోతే ఈ సినిమా మరలా పిక్ అప్ అయ్యేలాగా కనిపించడం లేదు.

ఈ సినిమా ఇక పెద్ద ప్లాప్ అవుతుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సినిమా కి సుజీత్ దర్శకత్వం వహించగా, యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -