Thursday, May 9, 2024
- Advertisement -

అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ‘సాహో’

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రభాస్ కూడా చిత్రబృందం తో పాటు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్. సినిమా ఇంకా విడుదల కాకుండానే నిర్మాతలకు భారీ ప్రాజెక్టులను తెచ్చిపెడుతోంది. యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్తో నిర్మించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సాహో సినిమా తెలుగు, తమిళం మరియు మలయాళం డిజిటల్ రైట్స్ కోసం 42 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ఏ సినిమా డిజిటల్ రైట్స్ కూడా ఇంత వసూలు చేసిన దాఖలాలు లేవు. అంటే ‘సాహో’ దే ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట. అయితే ఈ చిత్రం హిందీ డిజిటల్ రైట్స్ ఇంకా అమ్ముడు కావాల్సి ఉంది. దానితో నిర్మాతలకు మరింత లాభం వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముకేష్, జాకీష్రాఫ్, మందిరా బేడీ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -