మెగా హీరోలు చాలామంది ఉన్నప్పటికి మెగాస్టార్ పోలికలు, ఆ స్టైల్ మాత్రం ఒక్కరికే వచ్చాయి. అతను మరెవ్వరో కాదు మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుస సెక్సెస్‌లు అందుకుంటు స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేశాడు. అచ్చం చిరంజీలా డ్యాన్స్‌లు వేస్తు, చిరంజీవిని మైమరపించాడు సాయి ధరమ్ తేజ్. అయితే ఈ మధ్య వరుస ఫ్లాప్‌లతో తెగ ఇబ్బంది పడుతున్నాడు సాయి ధరమ్. ఇటీవల మనోడు నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సాయి ధరమ్ తేజ్ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. అర్జెంట్‌గా సాయి ధరమ్ తేజ్‌కు ఓ సాలీడ్ హీట్ కావాలి. ఈ విషయం పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ గత కొంతకాలంగా ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని సమాచారం.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తిక్క సినిమాలో హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని సమాచారం. బ్రెజిలియన్ బ్యూటీ లారిస్సా బోనేసి తిక్క సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. లారిస్సా బోనేసి ప్రస్తుతం ముంబైలో మోడలింగ్ చేస్తుంది. ఆమెను కలవడానికి సాయి ధరమ్ తేజ్ మాట్లాడితే ముంబై వెళ్లుతున్నాడట. దీంతో ఈ హీరో ఆమెతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు మరింత ఎక్కువైయ్యాయి. ఈ వార్తలను మరింత నిజం చేస్తు లారిస్సా బోనేసి సాయి ధరమ్ తేజ ఫోటోనే తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. అయితే సాయి ధరమ్ తేజ్ గురించి తెలిసినవాళ్లు ఇది సీరియస్ రిలేషన్షిప్ కాదని అంటున్నారు.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?