ఎన్ని రోజులు సినిమా ఆడింది అనే రోజులు పోయి సినిమా ఎన్ని రోజుల్లో ఎంత వసూలు చేసింది అనే రోజులు వచ్చేసాయి. కేవలం మొదటి వారం మహా అయితే రెండో వారం వరకూ సినిమా లెక్కలు కడుతున్నారు జనాలు.
ఎంతటి సూపర్ స్టార్ అయినా రెండో వారం దాటిన తరవాత సినిమా థియేటర్ వైపు కూడా చూడని పరిస్థితి. సల్మాన్ ఖాన్ ఈ సారి తన స్టార్ డం ఏంటో అందరికీ చూపించాడు. సుల్తాన్ తో తనకి ఎప్పుడూ అచ్కచ్చిన ఈడ రోజు వచ్చిన సల్లూ భాయ్ ఈ సినిమా విడుదల అయిన రోజే వీక్ ఎండ్ కాకపోయినా వర్కింగ్ డే అయినా ముప్పై ఆరున్న ర కోట్లు వసూలు చేసి మైండ్ బ్లాక్ చేసాడు పైగా సినిమాలో డల్ మూమెంట్స్ లేకుండా ఎక్కడ చూసినా కూడా ఎమోషనల్ గానో లేకపోతే యాక్షన్ ఎలిమెంట్స్ టైపులోనే డామినేషన్ ఉండటం.. సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.
సుల్తాన్ గా సల్మాన్ అదరగొడితే.. అరాఫా పాత్రలో అనుష్క శర్మ ఉతికేసింది. దానితో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు సినిమా మూడు రోజులకీ కలిపి 100 కోట్లు లాగడం విశేషం.