హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.. హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఛాలెంజ్‌ను స్వీకరించి, కసరత్తులు చేస్తున్న వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా అఖిల్ తన సోదరుడు నాగ చైతన్యకు ఛాలెంజ్ విసిరారు. దీన్ని స్వీకరించిన చైతన్య జిమ్‌లో వ్యాయామం చేస్తూ దిగిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.చైతన్య తన భార్య హీరోయిన్ సమంతకు ఛాలెంజ్ విసిరారు.తన భర్త నాగచైతన్య విసిరిన ఛాలెంజ్‌ను సమంత స్వీకరించారు.
జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అక్కినేని వారి కోడలు. చాలా హటుగా ఉన్న ఆ వీడియో ను చూసి నెటీజన్స్ ఎవరి స్టైల్ లో వారు కామెంట్ చేస్తున్నారు.సమంత ఏంటండీ ఇంత హాటుగా ఉంది అంటూ చెబుతుండడం వైరల్ అవుతోంది. సమంత సినిమాల్లో ఇంకా గ్లామర్ రోల్స్ చేస్తుందని ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పిందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇక సమంత తన ఛాలెంజ్‌ను పూర్తి చేసి ఉపాసన, శిల్పారెడ్డి, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్ విసురుతున్నా’ అని సామ్ పోస్ట్ చేశారు.
https://www.instagram.com/p/BjM3mezHUeV/?taken-by=samantharuthprabhuoffl