Tuesday, May 14, 2024
- Advertisement -

మావారు స‌మంత మోజులో ఉన్నారు ..ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి..?

- Advertisement -

మా ఆయ‌న హీరోయిన్ స‌మంత అంటే ప‌డి చచ్చిపోతున్నారు. ఆమెతో ల‌వ్‌లో ఉన్నారు ఏం చేయాలో చెప్పండి అంటూ ఓ ప్ర‌శ్న స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు ఎదురైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… స‌మంత , నాగ‌చైత‌న్య‌లు పెళ్లి త‌రువాత క‌లిసి న‌టిస్తున్న చిత్రం మ‌జిలి. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర పడుతుండ‌టంతో స‌మంత‌, నాగ‌చైతన్య‌లు సినిమా ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టారు. దీనిలో భాగంగా అభిమానుల‌తో ఓ చిన్న చిట్ చాట్ చేశారు. ల‌వ్‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ఏమైన ఉంటే చెప్పండి మేం వాటికి ప‌రిష్కారాలు చూపుతమ‌ని తెలిపారు.

అయితే లైవ్‌లో ఎవ‌రు ఉహించిన ప్ర‌శ్ర వీరికి ఎదురైంది. ఓ మహిళా వీరాభిమాని నాగచైతన్యతో మాట్లాడుతూ … మా ఆయన సమంతతో పిచ్చి గా ప్రేమలో ఉన్నారు. ఆయన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అని ప్రశ్నించారు. ఈ ప్ర‌శ్న విన‌గానే స‌మంత ఒకింత ఆశ్చ‌ర్య‌పోతు, ముసి ముసి నవ్వులు న‌వ్వింది. ఈ ప్ర‌శ్న‌కు చాలా తెలివిగా స‌మాధానం ఇచ్చాడు నాగ‌చైత‌న్య‌. ఓసారి మీ ఆయన్ని నా దగ్గరకు పంపించండి. తక్కువ టైమ్ లోనే సమస్యను పరిష్కరిస్తాను అని ఆన్సర్ చేశారు. ఏం చేస్తారేంటి అని స‌మంత చైతుని అడ‌గ్గా…కలిస్తే చెబుతానని అన్నారు. చైతు నుంచి ఇలాంటి అన్స‌ర్‌ను ఎవ‌రు ఉహించి ఉండ‌రు.

దీనిని రెండు రకాలుగా థింక్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఒక‌టి నా భార్య అంటే నీకు ఎందుకంత పిచ్చి అని క్లాస్ పీక‌డం , మ‌రోక‌టేమో పెళ్లాలు(స‌మంత‌) గురించి మ‌న‌కు ఇలాంటి వాళ్లు గురించి ఎందుకు గొడ‌వ అని లైట్ తీసుకోమ‌ని చెప్ప‌డం . ఇలా రెండు ర‌కాలుగా ఆలోచిస్తున్నారు నెటిజ‌న్లు. ఏది ఏమైన‌ప్ప‌టికి అభిమానుల అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అదిరిపోయ్యే స‌మాధానాలు ఇచ్చారు క్యూట్ క‌పూల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -