Friday, April 19, 2024
- Advertisement -

అమలాపాల్ టీజర్ పై సమంత కామెంట్స్

- Advertisement -

సౌత్ స్టార్ బ్యూటీ అమలాపాల్ ఇప్పుడు తమిళంలో ‘అడై’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర బృందం టీజర్ ని విడుదల చేసింది. పోస్టర్ల తోనే సర్ప్రైజ్ లు ఇచ్చిన అమలాపాల్ టీజర్ లో పెద్ద షాకే ఇచ్చింది.

టీజర్లోనే ఒక సన్నివేశంలో అమలాపాల్ పూర్తి నగ్నంగా కనిపించింది. పాత్ర డిమాండ్ చేస్తే అమల ఎలాంటి సన్నివేశాలు చేయడానికి సిద్ధమని అమలాపాల్ మరొకసారి ఈ చిత్ర టీజర్ ద్వారా నిరూపించింది. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక సినీ ప్రముఖుల నుంచి కూడా టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ పై సమంత రియాక్ట్ అయింది. “‘అడై’ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. బెస్ట్ విషెస్ టు అమలాపాల్. సినిమా కోసం నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ సమంత ట్వీట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -