అక్కినేని ఇంటి కోడలు హీరోయిన్ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సమంత ఇప్పటికే మూడు సినిమాలు చేస్తోంది. తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. భర్త నాగచైతన్యతో కలిసి మజిలి సినిమాలో నటిస్తుంది ఈ భామ. ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో యంగ్ హీరో శర్వానంద్‌తో కలిసి తమిళ 96 సినిమా రీమేక్‌లో నటిస్తోంది. తాజాగా మరో సినిమాకు ఆమె అంగీకరించినట్లు సమాచారం.
బెల్లంకొండ హీరోగా చేసిన తొలి సినిమా అల్లుడు శీనులో హీరోయిన్‌గా నటించింది సమంత.ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అలాంటి హీరోయిన్ కుర్ర హీరోతో చేయడం ఏంటీ అని అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. ఈ సినిమాకు సమంత భారీ పారితోషకం తీసుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం పక్కన పెడితే బెల్లకొండ హీరోగా తెరకెక్కే కొత్త సినిమాలో హీరోయిన్‌గా సమంతను తీసుకున్నారని సమాచారం అందుతోంది. RX100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.ప్రస్తుతం దర్శకనిర్మాతలు సమంతతో చర్చలు జరుపుతున్నారు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!