తన కెరీర్‌లోనే గోల్డెన్ డేస్‌ను ఎంజాయ్ చేస్తోంది హాట్ బ్యూటీ అక్కినేని సమంత. రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఏ బేబీ హిట్ కొట్టి మరింత ఆనందంలో ఉంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.తన నటనకి ఫాన్స్ నీరాజనాలు పడుతుండడం తో ప్రస్తుతం వెకేషన్ కి వెళ్లి ఫోటోషూట్లతో తన ఆనందాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది.ఇందులో భాగంగానే తాజాగా సమంత తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేసింది.
ఇంస్టాగ్రాం లో ఒక ఫోటో ద్వారా తన సీక్రెట్ టాట్టూను బైట పెట్టింది. ఇందులో ఇప్పటి వరకు ఎవరి కంటా పడని ఓ టాటూను చూపించింది. ఎద కింది భాగంలో ఉన్న ఆ టాటూలో తన భర్త పేరు ఉందని చెప్పుకొచ్చిందీ సమంత. ‘‘ఇప్పుడు నేను ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను. (ఇప్పటి వరకు దాచుకున్న ఈ టాటూను ఇప్పుడు చూపిస్తున్నాను). నా భర్త చై అక్కినేని నా ప్రపంచం” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

సమంత వదిలిన ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పిక్ కావడంతో అటు ఆమె అభిమానులు, ఇటు నెటిజన్స్ దీనిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో కొద్ది సమయంలోనే ఈ ఫొటో వైరల్ అయిపోయింది. దీనిని అనుకూలంగా కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం సామ్ చేసిన పనికి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
సామ్ కు టాట్టూలు కొత్త కాదు.. మణికట్టుపై ఒకటి.. నడుముపై మరొకటి ఉంది. ఇప్పుడు కొత్త టాటూ గురించి కూడా అందరికీ చెప్పేసింది.చై, సామ్ రహస్యంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఇద్దరి చేతిపై ఒకే రకమైన టాటూలు ఉండడం మీడియా కంట పడింది. ఇంకేముంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ అన్ని మీడియా సంస్థలు వార్తలు రాసేశాయి. తర్వాత అంతా అనుకున్నదే నిజమైంది. చై, సామ్ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది.