Monday, May 20, 2024
- Advertisement -

సమంత లవర్ ఎవరో?

- Advertisement -

అందాల భామ సమంత వరస సినిమాలతో దూసుకేల్తుంది. ఇటివలే పోలిసోడు, 24 అనే సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో కూడా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే నేల రిలిజ్ కు సిద్ధం అవుతుంది. అయితే తెలుగుతో పాటు తమిళంలో కూడా సమంత యామా బిజీగా ఉంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

అయితే ఇటివలే సమంత నేను సింగిల్ గా లేనని, సింగిల్ కాదని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది సమంత. వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న సమంత తన సాధక బాధకాలను చెప్పుకుంటూ చాలా కస్టపడి పనిచేస్తున్నానని ఎంతగా అంటే క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నానని అందుకే కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటానని చెప్పిన ఈ భామ ప్రత్యేకంగా లవ్ చేస్తున్నానని చెప్పకపోయినప్పటికీ లవ్ లో ఉన్న విషయాన్నీ మాత్రం కన్ఫర్మ్ చేసింది.

సిద్దార్థ్ తో పీకల్లోతు ప్రేమాయణాన్ని సాగించిన ఈ భామ పెళ్లి పీటల వరకు వెళ్ళిన తర్వాత బ్రేకప్ అయిన విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు సింగిల్ గా ఉన్నానని నేను చెప్పానా ? అంటూ ఎదురు ప్రశ్న వేసి షాక్ ఇచ్చింది. మరి ఆ రహస్య ప్రియుడు ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -