Saturday, May 10, 2025
- Advertisement -

పెళ్లి త‌రువాత ఆ ప‌ని చేయ‌నంటున్న స‌మంత‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత ..తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు ,త‌మిళ భాష‌ల‌లో టాప్ హీరోల‌తో న‌టించింది స‌మంత‌. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ‌. పెళ్లి త‌రువాత త‌న సినిమాల‌ను కంటిన్య్వూ చేస్తోంది. పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్లే. స‌మంత ప్ర‌స్తుతం త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలి అనే సినిమాలో న‌టిస్తుంది.

కొత్త పద్దతులను అనుసరించడంలో స‌మంత ఎప్పుడు ముందుంటుంది. పెళ్లి త‌రువాత తాను మాంసాహారాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక మీద తాను పూర్తిగా శాఖహారిగా మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చింది. చైతూ తన జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయని పేర్కొంది. స‌మంత ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -