Wednesday, May 22, 2024
- Advertisement -

బోరున ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్న సంజన.. నేడు అరెస్ట్..!!

- Advertisement -

కర్ణాటక లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలువురు కన్నడ సినీ పరిశ్రమ లోని వారు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కోగా తాజాగా సంజన కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.. ప్రభాస్ బుజ్జిగాడు సినిమా లో హీరోయిన్ చెల్లెలిగా నటించి తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత పలు సినిమాలు చేశారు సంజన.. కాగా ఇప్పుడు ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం ఆమె అభిమానులను కలిచివేస్తుంది..

ఈ ఉదయం బెంగళూరులోని సంజన నివాసంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులను నిర్వహించగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనికి ముందు మరో కన్నడ నటి రాగిణి ద్వివేది నివాసంపై కూడా అధికారులు రెయిడ్ చేశారు. మరో నటుడు రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకే సీసీబీ అధికారులు సంజన నివాసంపై దాడులు నిర్వహించారు.

తమ విచారణలో రాహుల్ పలు వివరాలను వెల్లడించాడని ఈ సందర్భంగా సీసీబీ వర్గాలు తెలిపాయి. సంజన, రాహుల్ ఇద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీల్లో పాల్గొనే వారని, పొరుగు దేశాల్లోని పలు కేసినోలకు వెళ్లేవారని చెప్పాయి. పార్టీలను నిర్వహించడం, డ్రగ్స్ ను సరఫరా చేయడం వంటి అభియోగాలను రాహుల్ పై మోపినట్టు తెలిపారు. ఇప్పుడు సంజనను విచారిస్తున్నామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -