సంక్రాంతి వస్తుంది అంటే చాలు థియోటర్లకు క్యూ కడుతుంటాయి సినిమాలు. కాని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవడంతో సంక్రాంతికి సినిమాలు తగ్గిపోయాయి.ఇక ఈ సంక్రాంతి కొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ సంక్రాంతికి ఏ సినిమాలు రానున్నాయో ఓ సారి చూద్దాం. ఈ ఏడాది ముందుగా విడుదల అవుతున్న చిత్రం బాలకృష్ణ కథానాయకుడు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.’ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత రామ్ చరణ్- బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా జనవరి 11న విడుదల కానుంది. కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇక ఫ్యామిలీ ఆడియోన్స్‌ను టార్గెట్ చేసుకుని వస్తోన్న సినిమా ఎఫ్2. వెంకీ ,వరుణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా 14న విడుదల అవుతుంది. ఇవి కాకుండా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పేట్టా మూవీ కూడా జనవరి 10న విడుదల అవుతుంది.మరి వీటిలో ఏ సినిమా పండగ సీజన్ ని క్యాష్ చేసుకుంటుందో చూడాలి.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు