Thursday, May 8, 2025
- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ

- Advertisement -

అత్తారింటికి దారేది సినిమా తరవాత పవన్ కళ్యాణ్ డైరెక్ట్ సోలో సినిమా లేక ఫాన్స్ తో పాటు పరిశ్రమ లో కూడా చాలా మంది అల్లల్లాడి పోతున్నారు. మధ్యలో గోపాలా గోపాలా ఒచ్చినా అందులో పవన్ ఉన్న నిడివి చాలా తక్కువ అవడం తో ఇవాళ విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నే మూడు సంవత్సరాల తరవాత పవన్ నుంచి ఒచ్చిన డైరెక్ట్ సినిమాగా కన్సిడర్ చేస్తున్నారు ఫాన్స్ కూడా.

పవర్ లాంటి పవర్ ఫుల్ సినిమా తీసిన బాబీ డైరెక్షన్ లో వస్తున్న సర్దార్ ట్రైలర్ తో నిరాశ పరిచినా సాంగ్స్ తో సూపర్ అనిపించాడు. ఇప్పుడు ఈ సర్దారుడు థియేటర్ లలో ఎంత మేరకు మెప్పించాడో చూడాలి.

రతన్ పూర్ అనే రాజ్యం లో రాచరిక  పాలన సాగుతూ ఉన్న సమయం లో అక్కడ భైరవ్ సింగ్ అనే దుర్మార్గుడు అక్కడి సంతతి మొత్తం దోచుకోవాలి అని చూస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం లో ఎప్పటినుంచో ఒస్తున్న రాజుల సంపద మీదా, ప్యాలెస్ మీదా , అక్కడి యువరాణి మీద అతని కన్ను పడుతుంది. ఆమె తో పాటు ఆ ప్రాంతం మీద కూడా గుత్తాధిపత్యం పొందడం కోసం అతను ప్రయత్నిస్తున్న టైం లో  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ ( పవన్ కళ్యాణ్ ) అక్కడికి చేరుకుంటాడు. ఇంటర్వల్ బ్యాంగ్ లో ఇద్దరి మధ్యనా గొడవ తీవ్రంగా పెరుగుతూ ఒస్తుంది .సరైన సమయం లో ఒచ్చే  ట్విస్ట్ ని బట్టి కథ ఆసక్తికరంగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఆహార్యం దగ్గర నుంచీ పవన్ కోపం, కామెడీ , డైలాగ్ లూ ఇవన్నీ సినిమాకి పెద్ద ఆస్తి గా చెప్పచ్చు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్ లు బాగా కుదిరాయి , మొదట్లో బోర్ కొట్టించినా ఫస్ట్ హాఫ్ పెద్దగా లేకపోయినా ఇంటర్వెల్ బ్యాంగ్ ని చాలా పర్ఫెక్ట్ గా సాగించాడు డైరెక్టర్. 

బ్రహ్మానందం కామెడీ బాగా తేలిపోయింది, సినిమాలో అవసరమైన పాళ్ళ లో కామెడీ ని కలపలేక పోయాడు డైరెక్టర్ బాబీ అది పెద్ద మైనస్ అని చెప్పాలి. సాంగ్స్ కూడా టైమింగ్ సరిగ్గా లేదు అనిపించింది. సెంటిమెంట్ సీన్ లలో కాజల్ మినహా ఇతర పాత్రలు సరిగ్గా చెయ్యలేదు. అక్కడక్కడా కాస్త ఓవర్ బిల్డప్ సీన్ లు విసుగు తెప్పిస్తాయి. ఫైట్ లలో కూడా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ లు బెడిసి కొట్టాయి. వీ ఎఫ్ ఎక్స్ కూడా వర్క్ అవలేదు అని చెప్పచ్చు. 

మొత్తంగా .. గబ్బర్ సింగ్ సినిమా కి సీక్వెల్ గా కాకపోయినా అదే పేరుతో ఒచ్చిన ఈ సర్దారోడు థియేటర్ లలో ఎక్కువకాలం ఉండేలా కనిపిస్తున్నాడు. రికార్డుల సంగతి ఎలా ఉన్నా సమ్మర్ సీజన్ కి హిట్ తో పవన్ కళ్యాణ్ శుభారంభం ఇచ్చాడు అని చెప్పచ్చు. వీక్ ఎండ్ లో ఫామిలీ తో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ సినిమా ఇది.అంతే కానీ ఏదేదో ఎక్స్ పెక్ట్ చేసేసి బాహుబలి రికార్డులు తలదన్నే సినిమా మాత్రం ఖచ్చితంగా కానే కాదు. పవన్ ఫాన్స్ కి అయితే పండగే పండగ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -