Tuesday, May 21, 2024
- Advertisement -

సర్దార్ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు…

- Advertisement -

గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక, నిర్మాతలు భావించారు. కానీ పలు కారణాల రిత్యా చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది.

అయితే పవన్ అభిమానులను నిరాశ పరచకూడదనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పవన్ సరసన కాజోల్ హీరోయిన్ గా నటిస్తుండగా, లక్ష్మిరాయ్ హాట్ హాట్ గా ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి, బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. పొంగల్ రేసులో నుంచి తప్పుకున్న పవన్ అభిమానులకు ఈ వార్త కాస్త ఊరట నిచ్చేదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -