- Advertisement -

సరిలేరు నీకెవ్వరు హైలైట్స్ ఇవే..!

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి మహేష్ అనిల్ రావిపూడి రిలాక్స్ అయ్యారు అనుకుంటున్నారేమో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇతర కార్యక్రమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి. సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి డైరెక్షన్ అద్భుతంగా ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. సరిలేరు నీకెవ్వరు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం తెలిసిందే.

జనవరి 5వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత ఘనంగా ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు మహేష్ బాబు గారి తో పాటు మెగా అభిమానులు కూడా వస్తుండడంతో ఈ వేడుక భారీ ఎత్తున జరగనుంది అన్న విషయం తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మెయిన్ హైలెట్స్ అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామెడీ ఓ రెంజ్ లో ఉండబోతుందని 20 నిమిషాలు ట్రైన్ ఎపిసోడ్స్ జబర్దస్త్ టీంతో బండ్ల గణేశ్ చేసే కామెడీ చాలా బాగా వచ్చింది అని అంటున్నారు.

ఇక మహేష్ బాబుని రష్మిక పడేయడానికి పడే పాట్లు చాలా బాగుంటాయని అంటున్నారు. సినిమా ఓపెనింగ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా మెయిన్ హైలెట్ సాగుతున్నాయని… అలాగే తమన్నా స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది అని అంటారు. మొత్తానికి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెంచిన చిత్రబృందం వాటిని మరింతగా పెంచేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -