Saturday, May 11, 2024
- Advertisement -

స‌రైనోడు మొదటి రివ్యూ!

- Advertisement -

ఈమ‌ధ్య భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తున్నాయి. అఖిల్, బ్రూస్లీ , స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ తాజా జాబితాలో నిలుస్తున్నాయి. స‌రైనోడు సినిమాపైనా విప‌రీత‌మైన రేంజు ఉంది. అల్లు అర్జున్‌తో… లెజెండ్‌లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్టిచ్చిన బోయ‌పాటి శ్రీ‌ను జ‌త‌క‌లిశాడంటే ఆ అంచ‌నాలు ఏ రేంజులో ఉంటాయో చెప్ప‌క్క‌ర్లెద్దు.

దానికి తోడు ట్రైల‌ర్ల‌తోనే బోయ‌పాటి భ‌య‌పెట్టేసాడు. ఈ సినిమా బాక్సాఫీసు హిట్ ఖాయం అంటూ మెగా అభిమానులు అనుకొంటున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్, క్యాథరిన్ లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అయితే మనకు అందుతున్న టాలీవుడ్ గోస్సిప్స్ ప్రకారం బోయపాటి మరోసారి తన విశ్వరూపం చూపాడని తెలుస్తుంది.

మాస్ సినిమా లు తీయటం లో దిట్ట అయిన బోయపాటి ఈసారి అల్లుఅర్జున్ తో ఊర మాస్ చేసాడని టాక్. స‌రైనోడు ఫ‌స్టాప్ ఓ రేంజులో ఉందట. హై ఓల్టేజీ యాక్ష‌న్ సీన్లు.. అదిరిపోయే స్టెప్పులూ, డైలాగుల‌తో వారెవా అనిపించాడ‌ట‌. ఇంట్ర‌వెల్ ఫైట్ అయితే.. బ‌న్నీ కెరీర్‌లోనే సూప‌ర్బ్ అని టాక్ అయితే సెకండాఫ్ మాత్రం.. అనుకొన్నంత స్థాయిలో లేద‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఫస్ట్ రివ్యూ వచ్చినంత వరకు మనం ఆగి చూడాలి మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -