Tuesday, April 30, 2024
- Advertisement -

నేను శైలజ లో కట్టప్పకి పెద్ద పాత్ర !

- Advertisement -

రామ్ కథానాయకుడిగా రూపొందిన ‘నేను శైలజ’ సినిమాపై యూత్ లో విపరీతమైన ఆసక్తి వుంది. దాంతో ఈ సినిమా రిలీజ్ కోసం వాళ్లంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ .. ఆమె తండ్రిగా సత్యరాజ్ కనిపించనున్నారు.

రామ్ – కీర్తి సురేష్ మధ్య రొమాన్స్ ఏ స్థాయిలో అలరిస్తుందో, కీర్తి సురేష్ – సత్యరాజ్ పాత్రల మధ్య సెంటిమెంట్ డ్రామా కూడా ఆ స్థాయిలో కట్టిపడేస్తుందని అంటున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు మనసును బలంగా తాకుతాయని చెబుతున్నారు.

ముఖ్యంగా సత్యరాజ్ పాత్రని దర్శకుడు కిషోర్ తిరుమల అద్భుతంగా తీర్చిదిద్దాడనీ, ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే  ‘బాహుబలి’లో ‘కట్టప్ప’ పాత్రతో సత్యరాజ్ ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక ఈ సినిమాతో తండ్రి పాత్రలతో ఆయన తెలుగులోను బిజీ కావడం ఖాయమని చెబుతున్నారు. జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -