Wednesday, May 8, 2024
- Advertisement -

ఒరేయ్ నేను చీరకట్టిన మగాడినిరా.. అంటున్న సిమ్రన్‌..

- Advertisement -

శివ‌కార్తికేయ‌న్, స‌మంత, కీర్తి సురేష్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళంలో తెర‌కెక్కిన సినిమా సీమ‌రాజా. అక్క‌డ మంచి విజ‌యం సాధించిన ఈసినిమా తెలులోకి అనువ‌దించారు. ఈ సినిమా 8న రెండుతెలుగు రాష్ట్రాల్లో కలిపి 400 థియేటర్స్‌‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత సాయికృష్ణ తెలిపారు.

ఇందులో న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే శివకార్తికేయన్ సరసన సమంత .. కీర్తి సురేశ్ నాయికలుగా నటించగా,లేడీ విలన్ గా సిమ్రన్ నటించింది. ఇది పూర్తి కమర్షియల్ సినిమా, శివకార్తికేయన్ తన గత చిత్రం ‘రెమో’లో ఆడవేశంలో అద్భుతంగా నటించార‌ని తెలిపారు.

ఈసినిమాలో లేడీ విల‌న్‌గా సిమ్ర‌న్ న‌టించింది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా అలరించిన ఆమె ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ చేశారు. ఇక సిమ్రన్ పండించే విలనిజం తెరపై చూసితీరవలసిందే అంటున్నారు నిర్మాత సాయికృష్ణ‌. ఒక మగాడికి చీరకడితే ఎలా ఉంటుందో అలా చూపించారు. సినిమాలో ఆమె చెప్పే ఓ డైలాగ్ సినిమాకే హైలెట్‌గా నిలువ‌నుంది. ‘ఒరేయ్ మీరంతా మగాళ్లు.. లుంగీ పైకెత్తి ఫైటింగుకు వస్తారేమో… నేను చీరకట్టిన మగాన్ని’ అని చెబుతుంది. సినిమాలో ఆమె పాత్ర హైలెట్ అయ్యే విధంగా ఉంటుంది.

ఈసినిమా అనువాదం అయిన‌ప్ప‌టికీ…ఎక్క‌డ తమిళ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈనెల 8 రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియోట‌ర్ల‌ల్లో విడుద‌ల‌కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -