Friday, March 29, 2024
- Advertisement -

అనుమతి లేకుండానే కమల్ ముద్దు పెట్టాడు : నటి రేఖ

- Advertisement -

ప్రముఖ తమిళ సీనియర్ నటి రేఖ.. ఇరవై ఏళ్ల క్రితం నటించిన “పున్నగాయ్ మన్నవ్” మూవీ షూటింగ్ లో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవలే చెప్పుకొచ్చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్ గా కమల్ హాసన్, రేఖ నటించారు. కే. బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కమల్, రేఖ ప్రేమించుకుంటారు. కానీ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు.

అయితే ఆత్మహత్య చేసుకునే సీన్ తీస్తున్నప్పుడు రేఖకు కమల్ ముద్దుపెట్టారట. ఈ విషయంలో ఓ ఇంటర్వ్యూలో రేఖ చెప్పిది. తన అనుమతి లేకుండా బాలచందర్, కమల్ హాసన్ ముద్దు సీన్‌ను పెట్టారని, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తనకు నిద్ర పట్టలేదని అన్నారు. అయితే ఆమె సరదాగా వెల్లడించిన ఈ విషయం కోలీవుడ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందించి.. ఇలాంటి దర్శకులు ఇప్పటికీ ఉన్నారని కామెంట్స్ చేసారు. రేఖకు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాటర్ సీరియస్ అవ్వకుందే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు రేఖ. “దయచేసి ఈ విషయంను ఇక్కడితో ఆపేయండి. నా పర్మిషన్ లేకుండా కమల్ నాకు ముద్దు పెట్టారంటే ఎవరూ నమ్మరు. ఈ విషయం నాకు, కమల్ కు, బాలచందర్ గారికి మాత్రమే తెలుసు.

కానీ ఇప్పుడు బాలచందర్ గారు బతికిలేరు. కాబట్టి కమల్ కమల్ హాసన్ నుంచి ఎలాంటి సారీ అవసరంలేదు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఒకవేళ లిప్ కిస్ సీన్ గురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను ఒప్పుకునేదాన్ని కాను అని తెలియజేయడానికి మాత్రమే. దయచేసి ఇక్కడితో ఈ విషయంను వదిలేయండి’’ అని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -