# మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉదృతంగా సాగుతోంది. నటీమణులు, మహిళా టెక్నీషియన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడం మొదలుపెట్టారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఉద్యమం సాగుతుంది.దీనిలో భాగంగానే తెలుగు ఇండస్ట్రీలో కూడా పలువురి పేర్లు బయటికి వచ్చాయి.దీంతో మా అసోసియేషన్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.స్టార్ యాంకర్లు సుమ కనకాల, ఝాన్సీ లతో పాటు మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ఈ కమిటీకి పెద్దలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వీరు సమావేశం ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో నటీమణులు, మహిళా టెక్నీషియన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఈ కమిటీలో బయటపెడితే వారి సమస్యలను పరిష్కరిస్తామని వారు పిలుపినిచ్చారు.
ఇందులో భాగంగా కమిటీకి పలు కొందరు నిర్మాతలు, హీరోలపై లైంగిక ఆరోపణలకి సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన నలుగురు నిర్మాతలు, ఇద్దరు మిడిల్ రేంజ్ హీరోలపై ఈ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయట. ఈ వివాదాలను పరిష్కరించడానికి అల్లు అరవింద్, జెమినీ కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. వారి పేర్లు బయటికి రాకుండా సైలెంట్ గా డీల్ చేస్తారని తెలుస్తుంది.