షకీలా ఈ పేరు ఒక సంచలనం అనే చెప్పాలి. ఆమె ఒకప్పుడు తెలుగు, మళయాళ ఇండస్ట్రీలను ఓ ఉపు ఊపింది. షకీలా సినిమాలు విడుదల అవుతుంటే చాలు స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొంతకాలంగా ఆమె క్రేజ్ తగ్గిపోయింది. తాజాగా ఆమె జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా షకీలా పాత్రను పోషిస్తుంది.
గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పెన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.ఈ పోస్టర్ లో ఒక గాజు గ్లాస్.. అందులో సగానికి ఆల్కహాల్ ఉంది. ఆ గ్లాస్ లో రిచా చద్దా సగం మునిగి ఒక సెక్సీ పోజ్ ఇచ్చింది. సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క పోస్టర్ చాలు. ఇక ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?