Saturday, May 4, 2024
- Advertisement -

ష‌కీలా పోర్న్ స్టార్ కాదట‌..!

- Advertisement -

మలయాళ బ్యూటీ షకీలా జీవిత క‌థ‌ను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఒకప్పుడు సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపింది ష‌కీలా.ఆమె సినిమాలు రిలీజ్ అవుతుంటే స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకునే వారు.ఇక ఈ బ‌యెపిక్‌లో షకీలా జీవితం వెనుక ఎన్నో సంఘటనలను తెరపై చూపిస్తారట. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ ఈ సినిమాను తెలుగు మలయాళంతో పాటు హిందీలో కూడా తెరకెక్కించాడు.ష‌కీలా పాత్ర‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా నటించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు.పోస్టర్ రిచా గోల్డ్ ధరించి డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇక నాట్ ఏ పార్న్ స్టార్ అనేది సినిమాకు ట్యాగ్ లైన్. 1980 – 90 కాలంలో షకీలా అడల్ట్ మూవీస్ లో నటించి అప్పటి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా కలెక్షన్స్ ను రాబట్టేది. సినిమాలో షకీలా జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ఇతర విషయాలని బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది2019 సమ్మర్ కి సినిమాను రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -