షకీలా …సౌత్ ఇండియాలో శృంగార దేవతగా భావిస్తారు. అప్పట్లో పోర్న్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే మళయాళ స్టార్ హీరోలు మమ్మూట్టి, మోహన్‌లాల్‌లు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. తాజాగా షకీలా నటించిన చిత్రం శీలవతి. సినిమా ఫస్ట్‌లుక్‌తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఓ చేతిలో మందు గ్లాస్, మరో చేతిలో సిగరెట్ తాగుతున్నా షకీల ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది.కేవలం 90 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ తో క్లియరెన్స్ ఇచ్చింది. అయితే సడన్‌గా ఈ సినిమా యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయి షాకిచ్చింది.
సినిమాను థియోటర్లలో కాకుండా ఇలా నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు చిత్ర యూనిట్. దీనికి కారణం కూడా లేకపోలేదు. సినిమా చాలా నాసిరకంగా చిత్రీకరించారట. ష్టార్ట్ ఫిల్స్ కన్నా ఘోరంగా ఉండటంతోనే సినిమాను నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేశారని తెలుస్తోంది. శీలవతి విడుదల అయిన కొన్ని గంటల్లోనే వ్యూస్ అర లక్ష వైపు పరుగులు పెట్టడం గమనార్హం. ఈ సినిమా షకీలా కెరీర్‌లో 250వ సినిమా కావడం విశేషం. మరో వైపు షకీలా బయోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
- Advertisement -
‘శీలవతి’ని ఇలా వదిలేశారు ఏంటీ..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -