మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “L2E ఎంపురాన్” . లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా కొన్ని మత సంస్థలు, సినిమాలోని కొన్ని వాస్తవ సంఘటనలు, పాత్రల చిత్రీకరణ అనుచితంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
దీంతో చిత్రయూనిట్ స్వచ్ఛందంగా రీ-సెన్సార్‌కు వెళ్లింది. సెన్సార్ బోర్డ్ (CBFC) మొత్తం 24 కట్స్, దాదాపు 2 నిమిషాల స్క్రీన్ టైమ్ తొలగించాలని సూచించింది. దీంతో వివాదాస్పద దృశ్యాలు అన్నింటిని తొలగించింది చిత్రయూనిట్.
అలాగే మలయాళ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ సురేష్ గోపికి ఇచ్చిన థాంక్స్ కార్డ్ కూడా తొలగించారు. రీ-సెన్సార్ చేసిన వెర్షన్ రేపటి నుండి దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రదర్శించబడనుంది. 2019లో విడుదలైన “Lucifer”కి సీక్వెల్‌గా వచ్చిన ఈ భారీ యాక్షన్ డ్రామా బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి రికార్డులను తిరగరాసింది.
మంజు వారియర్, టోవినో థామస్, సురాజ్ వెంజారమూడు, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆంటోని పెరంబవూర్, సుబాస్కరన్ అలిరాజా, గోకులం గోపాలన్ కలిసి ఈ హై బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు.
