- Advertisement -
కార్తీకేయ గుమ్మకొండ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భజే వాయు వేగం. మే 31న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. కార్తీకేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోండగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్‌లో జరిగే ఈ వేడుకకు శర్వానంద్ గెస్ట్‌గా రానున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ కాసేపటి క్రితమే ప్రకటించారు.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవి శంకర్, రాహుల్ హరిదాస్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.