యంగ్ హీరో శర్వానంద్ నటించిన పడి పడి లేచె మనసు నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ టాక్ వినిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.1.80 కోట్ల షేర్ ని రాబట్టింది.
శర్వా కెరీర్ లో ఇది సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. అతడు నటించిన ‘మహానుభావుడు’ సినిమా తొలిరోజు రూ.2.60 కోట్లను రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.నిన్ననే విడుదలైన మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా శర్వానంద్ సినిమా కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. అంతరిక్షం సినిమా మొదటి రోజున రూ.2 కోట్ల షేర్ ని రాబట్టింది.శర్వానంద్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఏరియాల వారీగా సినిమా కలెక్షన్లు..
నైజాం……………………………………. 0.67 కోట్లు
సీడెడ్……………………………………. 0.24 కోట్లు
ఉత్తరాంధ్ర…………………………….. 0.23 కోట్లు
గుంటూరు………………………………. 0.30 కోట్లు
ఈస్ట్………………………………………..0.15 కోట్లు
వెస్ట్…………………………………………0.08 కోట్లు
కృష్ణ………………………………………..0.10 కోట్లు
నెల్లూరు……………………………………0.05 కోట్లు
మొత్తం కలుపుకొని సినిమా రాబట్టింది 1.82 కోట్లను రాబట్టింది.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!