టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. శర్వా సినిమాలు విడుదల అవుతుంటే ఓ వర్గం ప్రేక్షకులు థియోటర్లకు క్యూ కడతారు. తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు శర్వానంద్. శర్వా హీరోగా నటించిన పడి పడి లేచే మనసు
చిత్రం రేపే (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతు తన తోటి హీరో వరుణ్ తేజ్‌పై కామెంట్స్ చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమా కూడా రేపే (శుక్రవారం) విడుదలవుతోంది.
ఇక్కడ ఎవరు ఎవరికి పోటీ కాదని చెప్పుకొచ్చాడు శర్వానంద్. తన సినిమాతో పాటు వరుణ్ తేజ్ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే మెగా కుటుంబంలో బన్ని – చరణ్ – వరుణ్ అందరితో కలిసే పెరిగానని – అందరం చిన్నప్పటినుంచి స్నేహితులమేనని శర్వానంద్ అన్నారు. నాకు వరుణ్ తేజ్ చిన్నప్పటి నుంచి తెలుసనని అందుకే మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఉండవని చెప్పాడు. శర్వానంద్.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు