నిహారిక ఇష్యూలో మెగా ఫ్యాన్స్ కాంపౌండ్‌ని కెలుక్కున్న శౌర్య, విజయదేవర కొండ స్టార్ ఢం గురించి మాట్లాడి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న నాగశౌర్య ఇప్పుడు శర్వానంద్ కూడా సున్నం పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నాగశౌర్య వర్సెస్ శర్వానంద్‌గా మారిన ఇష్యూ గురించి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. సినిమా మేకింగ్‌లో వేలు పెడుతున్నారట కదా అని అడిగిన మీడియాతో ‘నా సినిమాలో వేలే కాదు అవసరమైతే కాళ్ళు కూడా పెడతాను’ అనేంత గడుసుదనం నాగశౌర్యది. ఇక ఆ మధ్య తన సినిమాకు పబ్లిసిటీ చేసుకోవడం కోసం నిహారిక గురించి రకరకాలుగా మాట్లాడి మెగా కాంపౌండ్‌తో కూడా అనవసరంగా గోక్కున్నాడు నాగశౌర్య. అలాగే అర్జున్ రెడ్డి తర్వాత విజయదేవరకొండకు వచ్చిన స్టార్ ఢం గురించి చీప్‌గా మాట్లాడి అబాసుపాలయ్యాడు.
వీటన్నింటితో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి బ్యాడ్‌గా మాట్లాడేశాడు. ఈ హీరోగారితో చేసిన కణం సినిమా షూటింగ్ టైంలో సాయిపల్లవి సరిగా గౌరవించలేదట సదరు నాగశౌర్య బాబుని. అందుకే సాయిపల్లవి గురించి తోటి నటి అనే విషయం కూడా మర్చిపోయి బ్యాడ్‌గా మాట్లాడేశాడు. అయితే ఇప్పుడు నాగశౌర్యకంటే సూపర్ టాలెంటెడ్ అయిన శర్వానంద్ మాత్రం సాయిపల్లవి గురించి ఓ స్థాయిలో పొగిడేశాడు. సినిమా ఇండస్ట్రీలో శర్వాకు మంచి పేరు ఉంది. రామ్ చరణ్, ప్రభాస్‌లాంటి వాళ్లంతా శర్వా ప్రవర్తనను ఇష్టపడతారు. అలాంటి శర్వానంద్ ఇప్పుడు సాయి పల్లవి ప్రవర్తనకు, హార్డ్ వర్క్‌కి, టాలెంట్‌కి సూపర్ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. సాయి పల్లవి బ్రిలియంట్ యాక్టర్ అని తనను చూసి నేను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.
అలాగే అస్సలు గర్వం లేకుండా అందరితో ఒకేలా కలిసిపోవడం సాయి పల్లవి గొప్పదనం అని చెప్పుకొచ్చాడు. అన్నింటికీ మించి ఒక్కొక్క సీన్ కోసం సాయిపల్లవి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తుందని శర్వా చెప్పుకొచ్చాడు. దాంతో ఇప్పుడు సాయిపల్లవి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన శౌర్యకు సౌండ్ లేకుండా పోయింది. ఈ ఇష్యూ శర్వా వర్సెస్ నాగశౌర్యగా టర్న్ అయిన నేపథ్యంలో ఫ్యూచర్‌లో ఈ ఇద్దరు హీరోల బాండింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ప్రేక్షకులందరూ మెచ్చిన సాయిపల్లవి ప్రతిభ, హార్డ్ వర్కింగ్ నేచర్ గురించి నాగశౌర్య బ్యాడ్‌గా మాట్లాడడం ముమ్మాటికీ తప్పన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాగశౌర్యకు భలే కౌంటర్ ఇచ్చాడని అందరూ శర్వాని ప్రశంశిస్తున్నారు. ముందు ముందు అయినా నాగశౌర్య కాస్త హుందాతనం నేర్చుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!