Friday, May 9, 2025
- Advertisement -

రేపటి నుండి శర్వానంద్ – దిల్ రాజు ల శతమానం భవతి చివరి షెడ్యూల్

- Advertisement -
Shatamanam Bhavathi Last Schedule from Tomorrow

రేపటి నుండి శర్వానంద్ – దిల్ రాజు ల శతమానం భవతి చివరి షెడ్యూల్ – సంక్రాంతి కి  రిలీజ్ ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “శతమానం భవతి”.  

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి  షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది. నవంబరు చివరి వరకు సాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతి 2017 కి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.  ” శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది.

ఇప్పుడు శతమానం భవతి  తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు  సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది”, అని  దిల్ రాజు తెలిపారు. హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -