Monday, May 5, 2025
- Advertisement -

హీరోయిన్ తండ్రి వేరే భామ‌తో ఎఫైర్ సాగిస్తున్నాడ‌ట‌..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ కాలంలోనే త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా బాలీవుడ్‌లో సీనియ‌ర్ న‌టుడ‌ని చాలామందికి తెలిసిన విష‌య‌మే. శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ కూడా ఒకప్పుడు నటిగా సినిమాలు చేశారు. శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ తాజాగా కపిల్ శర్మ టీవీ షో హాజ‌రై త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌ల‌ను అభిమానుల‌తో పంచుకుంది. శత్రుఘ్న సిన్హా తాను మొద‌టిసారి పట్నా-ముంబై రైలు ప్రయాణంలో కలుసుకున్నామని, ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు త‌న మీద ప్రేమ క‌లిగింద‌ని చెప్పుకొచ్చింది పూనమ్.

1980లో శత్రుఘ్న సిన్హాను పెళ్లాడింది పూనమ్. ఇక ఈ షోలో త‌న భార్త ఎఫైర్స్ గురించి కూడా తెలిపింది. హీరోయిన్ రీనారాయ్‌తో త‌న భ‌ర్త చాలాకాలం ఎఫైర్ సాగించాడ‌ని షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టింది. తను వారిద్దరికీ అడ్డు రాలేదని అన్నారు.శత్రుఘ్న కూడా రీనా తన పర్సనల్ ఎఫైర్ అని, పెళ్లి తరువాత రీనాపై అభిమానం మరింత పెరిగిందని గతంలో ఓసారి చెప్పుకొచ్చాడు. శత్రుఘ్న సిన్హా- పూన‌మ్‌ల కూతురే సోనాక్షి సిన్హా. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. శత్రుఘ్న సిన్హా మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ ఎంపీగా కొన‌సాగారు. ఇటీవ‌లే ఆయ‌న ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

https://www.youtube.com/watch?v=ycJI4miXIJY

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -