Sunday, April 28, 2024
- Advertisement -

బర్త్ డే స్పెషల్..శివాజీ రీ రిలీజ్!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే నేడు. తలైవా బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రజనీ బర్త్ డే సందర్భంగా శివాజీ రీ రిలీజ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే రజనీకి సంబంధించి ముత్తు రీ రిలీజ్ కాగా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తాజాగా శివాజీని డిసెంబర్ 31న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు.

రజనీ కెరీర్‌ల బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లు వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు,రెండు విజయ్ అవార్డులను గెలుచుకుంది .

ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు. రజనీకాంత్ సరసన శ్రియా హీరోయిన్‌గా నటించగా వివేక్ , సుమన్ , సత్యన్ , మణివన్నన్ మరియు రఘువరన్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఇవాళ సూపర్ స్టార్ తలైవర్ బర్త్ డే సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -