శ్రీరెడ్డి ఇష్యూ, కాస్టింగ్ కౌచ్, తన తల్లిని తిట్టించడానికి జరిగిన కుట్ర తదితర పరిణామాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం దాల్చారు. ఆరు నెలలుగా యొల్లోమీడియా, లోకేష్ తన కుటుంబాన్ని టార్గెట్ చేసి కుట్రలు పన్నుతున్నారని ట్వీట్‌లద్వారా పవన్ తన ఆవేదనను వ్యక్తపరిచారు.
వర్మపై మా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఫిల్మఛాంబర్‌ను వదిలి పెల్లేది లేదని మెగా కుటుం అంతా అక్కడే నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘మా’ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఇష్యూను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందే పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి బాధ్యత వహిస్తూ ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలను, వివాదాలను ఒక కొలిక్కి తేవాలని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో తప్పుడు పనులు చేస్తున్న అందరి లెక్కలు తేల్చడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు సమాచారం.