Friday, May 17, 2024
- Advertisement -

సీనియర్ నటుడు శివాజీ రాజాకు గుండెపోటు..!

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చింది. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే అతడి పరిస్థితి సీరియస్ గా ఏమిలేదని తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై సురేశ్ కొండేటి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే శివాజీరాజాతో తాను మాట్లాడానని తెలిపారు. బీపీ డౌన్ అయిపోయి గుండెపోటు వచ్చిందని వివరించారు. ప్రస్తుతం అతడికి స్టంట్ వేస్తున్నారని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులుగా ఫామ్ హౌజ్ లో శివాజీరాజా కూరగాయలు పండిస్తూ సినిమా కార్మికులకు ఉచితంగా అందిస్తున్నాడని తెలిపారు.

ఇక గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత శివాజీ రాజా బయట పెద్దగా కనిపించడం లేదు. ప్రశాంతంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో శివాజీరాజాకు గుండెపోటు రావడంతో అందరూ షాక్కు గురయ్యారు. 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఆయన వందల సినిమాల్లో నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -