Sunday, May 5, 2024
- Advertisement -

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ కిడ్

- Advertisement -

సీనియర్ హీరో రాజశేఖర్ మరియు జీవితాల చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ ఈ మధ్యనే ‘దొరసాని’ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకి కె.వి.ఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేసినప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. అయితే మొదటి సినిమా డిజాస్టర్ గా మారడంతో శివాత్మిక ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి చదువు పై కాన్సెంట్రేట్ చేయాలని అనుకుంటోందట.

మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న శివాత్మిక రాజశేఖర్ ఎంబిబిఎస్ చేయనుంది. ‘దొరసాని’ సినిమా డిసాస్టర్ కావడంతో ఇక సినిమాలు వద్దని నిర్ణయించుకున్న శివాత్మిక చదువుపై కాన్సెంట్రేట్ చేసి తన తండ్రి లాగానే డాక్టరవ్వాలని నిర్ణయించుకుందట. విడుదలకు ముందు వరకు చదువు మరియు సినిమాలు రెండిటిపై ఆసక్తి చూపించిన శివాత్మిక మొదటి సినిమాతోనే రెండు పడవలపై ప్రయాణం కష్టమని అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకుందని కొందరు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -