Sunday, May 5, 2024
- Advertisement -

చెవిటి అమ్మాయిగా సీనియర్ బ్యూటీ

- Advertisement -

టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరో లలో శ్రియ శరన్ ఒకరు. దాదాపు అందరు సీనియర్ హీరోలకి నయనతార తర్వాత ఉన్న ఆప్షన్ శ్రియ నే. తన పాత్రల విషయంలోనూ, కథలోనూ శ్రియ చాలా ఆలోచించి మంచి పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ బిజీగా ఉంది శ్రియ. తాజాగా ఈమె ఒక సినిమాలో పెర్ఫార్మెన్స్ కి బోలెడంత స్కోప్ ఉన్న పాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. సృజన అనే ఒక కొత్త దర్శకురాలి దర్శకత్వంలో శ్రియ హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో శ్రియ శరణ్ పాత్ర చుట్టూ బోల్డంత ఎమోషన్ ఉంటుందట. తనది ఒక మెచ్యూరిటీ ఉన్న పాత్ర అని ఇప్పటిదాకా శ్రీయ ఇటువంటి పాత్రలో ఎప్పుడు కనిపించలేదని సమాచారం. ఈ సినిమాలో శ్రియ ఒక చెవిటి అమ్మాయి లాగా కనిపించనుందట. తన అద్భుతమైన పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్గా పోతోందని చిత్రబృందం విశ్వసిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో శ్రీయ ఒక బిడ్డకి తల్లి గా కనిపించనుందట. రొమాంటిక్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇప్పటికే ‘గోపాల గోపాల’ మరియు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలలో శ్రీయా తల్లి పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -