Saturday, May 18, 2024
- Advertisement -

కోటిన్నర వరకూ తీసుకుంటోందట!

- Advertisement -

టాలీవుడ్ లో ఎనభై లేదంటే తొంభై లక్షలిస్తేనే.. అబ్బో బాగా డబ్బులు తీసుకుంటోందని ప్రచారం చేసేస్తారు. పీక్ స్టేజ్ లో ఉన్నపుడు గోవా బ్యూటీ ఇలియానా కోటి రూపాయలు తీసుకుందన్న వార్త.. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడో పెద్ద సంచలనం. ఇప్పుడు.. కోటి దాటి ఓ హీరోయిన్ కోటిన్నర వరకూ అందుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ చెవులు కొరుక్కుంటున్నాయి.

సమంత, తమన్నా, కాజల్ లాంటి హీరోయిన్లు మెల్లగా ఫేడ్ అవుట్ అవుతుండడంతో.. శ్రీమంతుడు లాంటి హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ మూవీతో అందరి దృష్టినీ అట్రాక్ట్ చేసిన శృతి హాసన్.. ఇంతలా రెమ్యునరేషన్ అందుకుంటోందన్నది ఆ గుసగుసల సమ్మరీ.

తండ్రి… యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సినిమాకు కూడా.. డేట్స్ లేవని రిటర్న్ పంపేసిన ఈ బ్యూటీ… ఇప్పుడు ఓ మెగా హీరోతో చేయబోయే న్యూ ప్రాజెక్ట్ కు ఇంతలా రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. అయితే… నిజంగానే డేట్స్ లేవని శృతి ఉన్న విషయం చెప్పినా… ప్రస్తుతం ఆమెకున్న డిమాండ్ తో ఆ హీరో పక్కన నటింపజేస్తే బాగుంటుందని నిర్మాతలు కూడా కాస్త గట్టిగా ప్రయత్నించారట. క్యారెక్టర్ తో పాటు.. రెమ్యూనరేషన్ కూడా టెంప్టింగ్ గా ఉండడంతో… శృతి కాదనలేకపోయిందట.

ఈ విషయంలో నిజం ఏంటో అబద్ధం ఏంటో స్పష్టం కాలేదు. విషయం గాసిప్స్ దగ్గరే ఆగింది. కానీ… వద్దనుకున్నా వచ్చే అదృష్టం అంటే ఇదే అంటూ… అప్పుడే శృతిహాసన్ పై కాంప్లిమెంట్ లాంటి కామెంట్లు మొదలయ్యాయి. అంతే మరి.. కాలం కలిసొస్తే… కోటిన్నర ఇచ్చే సినిమా కూడా ఇంటి గుమ్మం తడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -