Saturday, May 18, 2024
- Advertisement -

హార్ట్ బ్రేక్ మీద పాట పాడనున్న శృతి హాసన్

- Advertisement -

ఈ మధ్యనే తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సేల్ తో బ్రేక్ అప్ అయిన సౌత్ బ్యూటీ శృతి హాసన్ తన బ్రేక్ అప్ కి, పాటకి సంబంధం లేదు అని చెప్తోంది. ఇక తాజాగా తన ఆటోబయోగ్రాఫికల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, “హానెస్ట్ గా చెప్పాలంటే అంటే నాకు బ్రయాన్ ఆడమ్స్ పాడిన ‘వెన్ ఐ వాజ్ ఇన్ న్యూ యార్క్ ఇన్ 1992’, ‘సమ్మర్ ఆఫ్ 69’ వంటి పాటలు అసలు అర్థం కూడా కాలేదు. ఎందుకంటే నేను 69 లో పుట్టలేదు. చాలామంది ఆ ఎమోషన్ కి అందుకే ఈజీగా కనెక్ట్ అవ్వరు. కానీ హార్ట్ బ్రేక్ కి మాత్రం అందరూ కనెక్ట్ అవుతారు అందుకే దాని పైన పాట రాశాను” అని చెప్పింది శృతిహాసన్.

“హార్ట్ బ్రేక్ మీద పాట అయినప్పటికీ మరీ అంతా బాధాకరంగా ఏమీ ఉండదు. జీవితంలో కొన్నిసార్లు విడిపోవడం అంటే ఏడవడం కాదు, వాళ్ళని వెళ్లనివ్వడం అని తెలుస్తుంది. నా మ్యూజిక్ మీతో పాటు మీ చుట్టూ వారు ఉన్నవారిని కూడా పాటను పాడే లాగా చేస్తుంది. పాటలో డెప్త్ కూడా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నారు” అని చెప్పిన శృతి హాసన్ ఈ ప్రాజెక్టు తనకు చాలా స్పెషల్ అని కూడా చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరం అయిన ఈ భామ తన మ్యూజిక్ కెరీర్ పైన దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -