Thursday, May 2, 2024
- Advertisement -

నేను నీతో ప‌డుకుంటే.. హీరోతో ఎవ‌రు ప‌డుకుంటారు..?

- Advertisement -

కాస్టింగ్ కౌచ్… ఆ మ‌ధ్య దీనిపై తీవ్ర ఉద్యమం సాగిన సంగ‌తి అంద‌రికి గుర్తు ఉండే ఉంటుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌తి ఇండ‌స్ట్రీలోను త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి కొంద‌రు హీరోయిన్స్ న‌టీమ‌ణులు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. అయితే ఈ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న త‌రుణంలో కొంద‌రు కాస్టింగ్ కౌచ్‌ను త‌మ స్వార్థానికి వాడుకోవ‌డంతో , ఈ ఉద్య‌మం నీరుగారిపోయింది.

అయినప్ప‌టికి ఈ కాస్టింగ్ గురించి ఎక్క‌డో ఓ చోట చ‌ర్చ న‌డుస్తునే ఉంది. తాజాగా మ‌రో హీరోయిన్ త‌న జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. శృతి మరాటే… తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌కపోవ‌చ్చు కాని, శృతి మరాటే ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచియం ఉన్న పేరే. తాజా ఈ భామ త‌న‌కు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి మీడియాతో పంచుకుంది. ఓ నిర్మాత సినిమా ఆఫర్ ఇస్తానని నన్ను సంప్రదించాడు. నీకు అవ‌కాశం ఇవ్వాలంటే కాంప్రమైజ్ కావాలి, ఒకరాత్రి నాతో పడుకోవాలని అన్నాడు.

దీంతో నాకు పిచ్చ కోపం వ‌చ్చింది. వెంట‌నే నీతో నేను ప‌డ‌కుంటే , సినిమాలో హీరోతో ఎవ‌రు ప‌డుకుంటార‌ని ప్ర‌శ్నించి అక్క‌డ నుంచి బ‌య‌టప‌డ్డాన‌ని చెప్పుకొచ్చింది శృతి. నిర్మాత చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో తనను సినిమా నుండి తప్పించారని అయినప్పటికీ తను బాధపడలేదని తెలిపింది. ఈ విష‌యం ఇప్పుడు బ‌య‌టికి చెప్ప‌డానికి కార‌ణం కూడా ఉంద‌ని, కేవలం మ‌హిళల్లో ధైర్యం నింపడానికే తను ఈ ఘటన గురించి బయటపెట్టానని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -