Tuesday, April 23, 2024
- Advertisement -

సిద్ధార్థ్ , సమంత ల మధ్య ఇంకా మనస్పర్థలు పోలేదా..!!

- Advertisement -

పెళ్ళికాకముందు హీరో సిద్ధార్థ్, సమంత లు ఇద్దరు లవర్స్ అన్నమాట అందరికి తెలిసిందే.. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు.. సమంత ఆ తర్వాత నాగ చైతన్య ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు కూడా వచ్చాయి.. తాజాగా వీరి కాంబో లో సినిమా చేయడానికి అజయ్ భూపతి సన్నాహాలు చేశాడు.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో తాను తీసిన ఓకే ఒక్క చిత్రం తోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు అజయ్ భూపతి. RX 100 చిత్రం యువత ను ఉర్రూతలూగించడం మాత్రమే కాకుండా, ఆలోచించేలా చేసిన ప్రేమ కథా చిత్రమ్. అయితే మరొక డిఫెరెంట్ కథాంశం తో అజయ్ భూపతి సిద్ధమయ్యారు. అయితే మొదట గా ఈ చిత్రానికి సంబంధించిన కథను నాగ చైతన్య, సమంత లకు వినిపించగా ఇద్దరూ కూడా ఓకే చెప్పారు.

అయితే ముందు నాగ చైతన్య వరుస ప్రాజెక్ట్ ల కారణం చేత చిత్రం నుండి తప్పుకోగా, కొద్ది రోజుల అనంతరం సమంత కూడా తప్పుకున్నారు. అయితే శర్వానంద సరసన కథానాయికగా ఐశ్వర్య రాజేష్ నటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ చిత్రం లో మరొక కీలక పాత్ర కోసం నటుడు సిద్ధార్ద్ ను సంప్రదించగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సిద్ధార్ద్ చాలా ఏళ్ల విరామం తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మొత్తానికి సిద్ధార్ద్ ఎంట్రీ కొందరిలో ఆసక్తిని కలిగించే విషయం అని చెప్పాలి.

మరి ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇంకా ఆసక్తికరం గా ఉంటుంది అని, మెల్లమెల్లగా అన్ని రివీల్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -