టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి సితార ఘట్టమనేని రీసెంట్ గా ఒక యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. పి.ఎం.జే జెవెలరీ ప్రకటనలో సితార నటించగా దానికి సంబందించిన డిజిటల్ వాల్ పోస్టర్స్ ఫారిన్ లో కూడా ప్రమోట్ చేశారు. దానితో ఒక్కసారిగా సితార పేరు మారుమోగింది. సితార ఈ యాడ్ షూట్ కోసం తనని తాను బాగా ప్రిపేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార తన ఇన్ స్టాగ్రాం లో 1.3 మిలియన్ ఫాలోవర్స్ తో సందడి చేస్తుంది.
ఈ యాడ్ చేసినందుకు గాను సితార కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంద్. అందిన సమాచారం ప్రకారం సితార పి.ఎం.జె యాడ్ లో నటించినందుకు గాను దాదాపు కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. అయితే ఈ డబ్బుని సితార సొంత ఖర్చులకు వాడుకుంటుందా.. లేక మమ్మీ డాడీలకు ఇస్తుందా అని అడిగితే.. ఓ చారిటీకి విరాళంగా ఇచ్చిందని తెలుస్తుంది. సూపర్ స్టార్ కూతురు అంటే ఆయన లానే మంచి మనసు కలిగి ఉంటుంది. సితార కూడా తన ఫస్ట్ రెమ్యునరేషన్ ని డొనేట్ చేసి సర్ ప్రైజ్ చేసింది.
ఎవరికైనా సరే ఫస్ట్ రెమ్యునరేషన్ చాలా స్పెషల్ గా ఉంటుంది అలాంటి స్పెషల్ రెమ్యునరేషన్ ని సితార ఒక మంచి పనికి వాడి అందరిని మెప్పించింది. ఓ పక్క తండ్రి సూపర్ స్టార్ మహేష్ చిన్న పిల్లల హృద్రోగులకు అండగా నిలుస్తూ వారికి ఆపరేషన్ లను చేయిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు తండ్రి బాటలో సితార కూడా తన రెమ్యునరేషన్ కూడా చారిటీకి ఇచ్చి గొప్ప మనసు చాటుకుంది.
ఇక సితార, గౌతం ల ఫ్యూచర్ పై నమ్రత కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వాళ్లు ఏమవ్వాలి ఏమవుతారు అన్నది వారి ఇష్టానికే వదిలేస్తున్నాం. సితారకు సినిమాలంటే ఇష్టమని అన్నారు నమ్రత. సూపర్ స్టార్ వారసుడిగా గౌతం సినిమాల్లోకి వస్తాడా లేదా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. అయితే గౌతం చేయనన్నా సరే ఫ్యాన్స్ మాత్రం అతన్ని ఫ్యూచర్ సూపర్ స్టార్ గా చూడాలని ఆశిస్తున్నారు. మహేష్ సినిమాల విషయానికి వస్తే త్రివిక్రం డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు.