తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకకం ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇన్నాల్లు లోలోపల జరుగుతన్న ఆ డ్రగ్స్ మాఫియా ఇప్పుడు బయటకు రావడంతో ప్రముఖుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.టాలీవుడ్లో పలువురు హీరోలు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, సింగర్లకు ఎక్సైజ్ శాఖ నోటీసులు అందించడంతో తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. మొత్తం 15 మందికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ డ్రగ్స్ ప్రకంపనలు అభిమానులకు తాకాయి. టీవీ ఛానల్స్ లో ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఆయా హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. డ్రగ్స్ కేసులో పట్టుబడింది మీవాడే అని ఓ అభిమాన వర్గం…. కాదు మీవాడే అని మరో అభిమాన వర్గం మధ్య భారీ మాటల యుద్ధం నడుస్తోంది.
తెగ స్పీడుగా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్‌కు కూడా నోటీసులు అందాయని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ డైరెక్టర్ ఎవరో అందరికీ అర్థమైపోయింది. ఈ దర్శకుడితో మీ హీరో ఇన్ని సినిమాలు తీశాడు, మీ హీరోకు ఈ విషయం ఇప్పటికే తెలిసే ఉంటుందని అని అభిమానులు వాదులాడుకుంటున్నారు.
- Advertisement -
సోషల్ మీడియాలో అభిమానులఫైట్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -