బాలీవుడ్ ఐటెం గార్ల్ మలైక ఆరోరా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో ఎన్నో ఐటెం సాంగ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా కొన్ని ఐటెం సాంగ్స్‌లో నటించింది. కొద్ది సంవత్సరాల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి హీరో అర్జున్ కపూర్‌తో ఎపైర్ సాగిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్‌లో అందరికి తెలిసిన విషయమే. తాజాగా వీరిద్దరు కలిసి ఓ పార్టీకి వెళ్లారట. అక్కడ ఫుల్‌గా తాగేసిన మలైక నోటికి వచ్చిన బూతులు తిడుతు అక్కడ ఉన్నవారందరిని తిట్టడం మొదలుపెట్టిందట.
పక్కనే అర్జున్ కపూర్ ఉన్నప్పటికి ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదట.ఆ పార్టీకి అర్జున్ కజిన్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా వెళ్లిందట. సోనమ్ కపూర్ మలైకను ఆపే ప్రయత్నం చేయగా స్టే అవే (దూరంగా వెళ్లు)’ అని పొగరుగా చెప్పడంతో సోనమ్ ఒక్కసారిగా షాక్ అయిందట. దీంతో సోనమ్ కపూర్ కాస్తా హార్ట్ అయిందని తెలుస్తోంది. సోనమ్ మొదటి నుంచి మలైక ఆరోరా- అర్జున్ కపూర్‌ల ప్రేమకు అండగా ఉంటు వస్తోంది. ఈ సంఘటనతో సోనమ్ వారికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
- Advertisement -
తాగి రచ్చ చేసిన ఐటెం గాళ్..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -