తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రెండో పెళ్లికి రెడీ అయింది. గతంలో ఆమెకు ఆశ్విన్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఏడేళ్ల తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు చేప్పారు ఈ జంట. వీరిద్దరికి 5 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. సౌందర్య ప్రస్తుతం తన కొడుకుతో జీవిస్తోంది. వ్యాపారవేత్త విషాగన్ వనంగముడితో ఆమెకి పరిచియం ఏర్పడింది. ఈ పరిచియం కాస్తా ప్రేమ,పెళ్లి వరకు దారి తీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీరి పెళ్లి జరుగుతోంది.
ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట , తాజాగా పెళ్లి ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 11న వీరి వివాహం జరగబోతుంది. రజినీకాంత్ ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ పెళ్లి వేడుకను వీలైంతసింపుల్ గా చేయాలనేది రజినీకాంత్ ఆలోచన. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కాబోతుందని సమాచారం. సౌందర్య.. రజినీకాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘విఐపి2’ సినిమాను కూడా సౌందర్యే దర్శకత్వం వహించింది. ప్రస్తుతం సౌందర్య రజినీకాంత్ సినిమాల కాల్ షీట్లను చూస్తుంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ