Friday, March 29, 2024
- Advertisement -

రెండో పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ..!

- Advertisement -

త‌మిళ హాట్ బ్యూటీ అమలాపాల్ రెండో పెళ్లికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తుంది.గ‌తంలో ఆమె ద‌ర్శ‌కుడు విజ‌య్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లి త‌రువాత కూడా సినిమాల‌లో న‌టిస్తాన‌ని చెప్పి ,భ‌ర్త విజ‌య్‌తో విభేదించి విడాకులు తీసుకుని మ‌రి సినిమాల‌లో న‌టించింది.అయితే పెళ్లి త‌రువాత ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.వ‌చ్చిన సినిమాలు కూడా అడ‌ల్ట్ కంటెంట్ సినిమాలు ఎక్కువుగా వ‌చ్చాయి.చేసేది లేక వ‌చ్చిన సినిమాలనే ఒప్పుకుంటు పంబం గడుపుతుంది.అయితే గ‌తంలో అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది.

ఇప్పుడు ఆ దిశ‌గా అమలాపాల్ అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తుంది.త‌న రెండో పెళ్లి గురించి అమలాపాల్ మాట్లాడుతు…మొదట తాను చేసుకున్న పెళ్లి తన ఇష్టప్రకారం జరిగిందని తెలిపింది. అది సక్సెస్‌ అవ్వలేదని, సో తన రెండో పెళ్లి విషయాన్ని తన తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేశానని చెప్పింది. వారు కుదిర్చిన పెళ్లి కొడుకును చేసుకోవడానికి తాను సమ్మతిస్తానని అంది. అయితే అంత త్వరగా పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం తనకు లేదని పేర్కొంది. దీంతో ఈ అమ్మడికి ఇంట్లో రెండో పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -